• facebook
  • whatsapp
  • telegram

APPSC: 25న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌  పరీక్షలు  

బాపట్ల, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఇన్‌ ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు మే 25న బాపట్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. ఆయన మే 23న మాట్లాడుతూ జిల్లాలో 200 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. చీరాల సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులకు ఉదయం 7.30 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామన్నారు. ఉదయం 8.30 గంటల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.