పర్యవేక్షణకు యూజీసీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలతోపాటు పీహెచ్‌డీల జారీలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తరచూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యూజీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. నియామకాలు, పీహెచ్‌డీల జారీ తీరును పరిశీలించి... అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్టాండింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ తరచూ సమావేశమై కొన్ని విద్యాసంస్థలను ఎంపిక చేసి, వాటిలోని అన్ని పత్రాలను పరిశీలిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆ వర్సిటీలు, కళాశాలలపై చర్యలు తీసుకుంటుంది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు యూజీసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని యూజీసీ ఛైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్‌కుమార్ స్పష్టంచేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.