• facebook
  • whatsapp
  • telegram

Education: వృత్తి నిపుణులకు ఇంజినీరింగ్‌ డిగ్రీ   

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హత లేకపోయినా వృత్తి నిపుణులుగా టెలీకమ్యూనికేషన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సెమీ కండక్టర్‌ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి కోసం హైదరాబాద్‌ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎలక్టాన్రిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అందజేస్తామని ప్రొఫెసర్‌ సత్య సుధాకర్‌ ఎడ్లపల్లి అక్టోబ‌రు 31న‌ తెలిపారు. ఎలక్ట్రికల్, ఎలక్టాన్రిక్స్‌ ఇంజినీరింగ్‌ రంగంలో మరింత ఉత్తేజకరమైన కెరీర్‌ను ఈ డిగ్రీ అందించనుందని వివరించారు.  ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసిన వృత్తి నిపుణులకు 5జీ, 6జీ నెట్‌వర్క్‌ల కోసం వేర్వేరు టెలికాం సంస్థలు చేస్తున్న పరిశోధనల్లో కీలక ప్రాధాన్యం లభించనుంది.  


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.