• facebook
  • whatsapp
  • telegram

Bits Graduation Day: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే!

* పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

* బిట్స్‌ స్నాతకోత్సవంలో 7,514 మందికి పట్టాల అందజేత


శామీర్‌పేట, న్యూస్‌టుడే: వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, దీనికి బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ విద్యార్థులే నిదర్శనమని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, బోర్డు సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. న‌వంబ‌రు 19న‌ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహించిన వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగామ్స్‌ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓవైపు సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే బిట్స్‌ పిలానీ అందిస్తున్న వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ కార్యక్రమంలో చేరి పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

* బిట్స్‌ పిలానీ కులపతి పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ఆచార్య కుమార మంగళం బిర్లా పంపిన సందేశాన్ని ఆ విద్యాసంస్థ ఉప కులపతి ఆచార్య వి.రాంగోపాల్‌ స్నాతకోత్సవంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా 7,514 మందికి పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ, ఐటీఈఎస్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌, ఆటోమోటివ్‌ ఎనర్జీ రంగాల డైనమిక్‌ అవసరాలను తీర్చడంలో బిట్స్‌ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కోర్సుల్లో నేర్చుకున్న అంశాలను తమకు సహకరించిన సంస్థలకు ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆచార్య జి.సుందర్‌ మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా 1.14 లక్షల మంది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఇక్కడ అందిస్తున్న వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ కోర్సులను ఉపయోగించుకున్నారని వివరించారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాక్‌ మార్కెట్‌లో చక్కని కెరియర్‌!

‣ చలికాలంలో పరీక్షల సన్నద్ధత!

‣ సైనిక కొలువుకు సులువు దారి!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.