• facebook
  • whatsapp
  • telegram

MCA: విద్యార్థుల చూపు.. ఎంసీఏ వైపు!  

* ఉమ్మడి కృష్ణాలో కోర్సుకు పెరిగిన డిమాండు

కానూరు, నిడమానూరు, న్యూస్‌టుడే: కొంతకాలం కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిన ఎంసీఏ కోర్సుకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఈ కోర్సుకు డిమాండ్‌ ఏర్పడింది. డిగ్రీ, బీటెక్‌ ఇతర కోర్సులు పూర్తి చేసినవారు ఐసెట్‌ ప్రవేశపరీక్ష రాసి ఇందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

* 1994లో మూడేళ్ల కాల పరిమితితో మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సు ప్రారంభించారు. ఇంటర్‌లో లేదా డిగ్రీలో గణితం ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదివిన వారు మాత్రమే ఈ కోర్సుకు అర్హులని నిర్ణయించారు. అప్పుడు సాఫ్టువేర్‌ రంగంలో ఆసక్తి ఉన్న డిగ్రీ విద్యార్థులు ఈ కోర్సు చదివి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సాంకేతిక విద్యకు సమాంతరంగా ఈ కోర్సు కూడా కొంతకాలం బాగా నడిచింది. ఆ తరువాత ఇంజినీరింగ్‌ కళాశాలలు పెరగడం, ఎక్కువ మంది అటు వైపు మళ్లడం చేశారు. డిగ్రీ మూడు, ఎంసీఏ మూడు వెరసి ఆరేళ్లు పడుతుందన్న ఉద్ధేశ్యంతో గతంలో ఎంసీఏకు డిమాండు తగ్గడం మొదలైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో 2500లకు పైగా సీట్లు ఉండేవి. చాలా వరకు కళాశాలల ఈ సీట్లను సైతం  తగ్గించుకున్నాయి. కొన్ని కళాశాలలు ఈ కోర్సునే మూసివేశాయి.

2020 నుంచి గత వైభవం..

మూడేళ్ల కోర్సు కాల పరిమితిని 2020 నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పలువురు విద్యార్థులు ఈ కోర్సు వైపే దృష్టి సారిస్తున్నారు. ఇటు డిగ్రీతో పాటు బీటెక్‌ పూర్తి చేసినవారు కూడా ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు జిల్లాలోని ప్రముఖ కళాశాలల్లో ఎంసీఏ కోర్సు చేసిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షికవేతనంతో ఎంపికవడం కూడా ఈ మార్పునకు కారణంగా కన్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఈ కోర్సు చేయడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నా.. సీట్లు మాత్రం తక్కువ అందుబాటులో ఉన్నాయి.

సాంకేతిక విద్యార్థులతో పోటీగా కొలువులు: కె.అంజిరెడ్డి, ఆచార్యులు

ప్రఖ్యాత సంస్థలు ఎంసీఏ విద్యార్థులకు కూడా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి. వీరికి బీటెక్‌, ఇతర విద్యార్థులతోపాటు రాత, మౌఖిక పరీక్షలు పెడుతున్నాయి. కొన్ని బహుళజాతి సంస్థలు పీజీ కోర్సుగా గుర్తించి ఎక్కువ వేతనంతో కొలువులు ఇస్తున్నాయి. సాఫ్టువేర్‌ రంగం మళ్లీ పుంజుకుంటే ఎంసీఏ పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

కోర్సుపై అవగాహన అవసరం: పరిటాల చిరంజీవి, అకడమిక్‌ డైరెక్టర్‌

ఎంసీఏ చాలా విలువైన కోర్సు. సాఫ్టువేర్‌ రంగంలో సంస్థలు దీనిని సాంకేతిక విద్యగానే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనితో వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇది శుభపరిణామం. ఈ పరిస్థితిని గమనిస్తూ ఇందులో చేరాలనుకున్న విద్యార్థులు ఈ కోర్సుపై అవగాహన పెంచుకోవాలి.

కాలపరిమితి తగ్గడం మంచిదే: కావూరి శ్రీధర్‌, ప్రాంగణ ఉపాధి అధికారి

కరోనా అనంతరం 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సుకు రెండేళ్ల కాలపరిమితి చేశారు. దేశ వ్యాప్తంగా డిమాండు ఉండటం, బహుళజాతి సంస్థలు వీరికి విస్తృత అవకాశాలు కల్పించడం వల్ల విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. మంచి కళాశాలలు ఎంపిక చేసుకుంటే ఈ కోర్సు పూర్తి చేస్తే చక్కని అవకాశాలు వస్తాయి.  

ఉమ్మడి  కృష్ణాలో ఎంసీఏ కోర్సు అందించే కళాశాలలు: 21

అందుబాటులో ఉన్న సీట్లు: 1350

ఐసెట్‌ అర్హత సాధించిన విద్యార్థులు: 10,000
 


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్‌

‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!

‣ బీటెక్‌ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?

‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.