* మొత్తం 1,105 ఖాళీల భర్తీ
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2023 ఫలితాలను విడుదల చేసినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సివిల్స్ ప్రధాన పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)కు హాజరు కావాల్సి ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థులకు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 అందుబాటులో ఉంటుందని, డిసెంబర్ 15లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2023 ఫలితాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.