• facebook
  • whatsapp
  • telegram

Education: 2047 నాటికి వికాస భారత్‌ సాధనే లక్ష్యం

విద్యావేత్తల సదస్సులో గవర్నర్‌ పిలుపు
ఈనాడు, హైదరాబాద్‌: వికాస భారత్‌ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించేలా ఏం చేయాలనే అంశంపై విలువైన ఆలోచనలు పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని విద్యావేత్తలకు, అధ్యాపకులకు గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సూచించారు. నీతి ఆయోగ్‌, అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌ల సహకారంతో ‘వికాస భారత్‌-2047’ లక్ష్యాన్ని వివరిస్తూ డిసెంబ‌రు 11న‌ రాజ్‌భవన్‌లో ‘సైన్స్‌, టెక్నాలజీ ఆవిష్కరణల్లో భారత్‌ సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వికాస భారత్‌ విజన్‌ను రూపొందించడంలో విద్యావేత్తలను, విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వర్చువల్‌ ప్రసంగాలతో సదస్సు ప్రారంభమైంది. అనంతరం గవర్నర్‌ ప్రసంగిస్తూ.. దేశానికి ఇంత గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను గవర్నర్‌గా ఉన్న తెలంగాణ, పుదుచ్చేరిలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో ముందుంటాయని ఆమె పేర్కొన్నారు. విద్యావేత్తలు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొని వారి ఆలోచనలను పంచుకున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.