• facebook
  • whatsapp
  • telegram

B.Ed Counselling: బీఈడీ కౌన్సెలింగ్‌కు 5 నెలలుగా నిరీక్షణ

* యాజమాన్యాలతో ‘సర్దుబాటు’ కావట్లేదా?

* విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా షెడ్యూలు ఏది?

​​​​​

ఈనాడు, అమరావతి: విద్యా సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా బీఈడీ కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వలేదు. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. బీఈడీ కళాశాలలు కాసులు కురిపించే కామధేనువుల్లా మారడంతో అన్ని ‘సర్దుబాటు’ అయ్యే వరకూ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ రావడం లేదు. తనిఖీలు, వర్సిటీల అనుబంధ గుర్తింపు అంటూ ఏదో ఒక మెలిక పెడుతూ యాజమాన్యాలపై ఉన్నత విద్యాశాఖ ఒత్తిడి తెస్తోంది. యాజమాన్యాలు ప్రసన్నం చేసుకోగానే షెడ్యూలు ప్రకటిస్తోంది.
 

* ఈ ఏడాది ఎడ్‌సెట్‌ జూన్‌ 14న నిర్వహించగా, జులై 14న ఫలితాలు వచ్చాయి. 11,236 మంది పరీక్ష రాయగా, 10,908 అర్హత సాధించారు. ఫలితాలు విడుదలై ఐదు నెలలు కావొస్తుంది. 2023-24 విద్యా సంవత్సరం మరో నాలుగైదు నెలల్లో (ఏప్రిల్‌/మే) ముగియనుండగా, కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యాశాఖలో చలనం లేదు. ఓ పక్క ప్రవేశాలు లేక పీజీ కోర్సులు బోసిపోతుండగా, మరోపక్క పది వేల మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నా, బీఈడీ సీట్లు కేటాయించడం లేదు.

వీరి అక్రమాలు.. వారికి వరాలు

రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించక పోవడంతో బీఈడీలో చేరేందుకు ఏపీ విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లింది. చాలా కళాశాలలు ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకొని, తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు పెట్టి, సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. యాజమాన్యాలు చేసే ఈ అక్రమాలను కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది గుంటూరుకు చెందిన ఓ కళాశాల యజమాని రూ.2 కోట్ల వరకు వసూలు చేసి, అన్ని స్థాయిల్లోనూ సర్దుబాటు చేసినట్లు ఆరోపణలున్నాయి.

* మరోసారి ఇలాంటి సర్దుబాటు కోసం యాజమాన్యాలు వసూళ్లు చేస్తున్నాయి. అనుబంధ గుర్తింపునిచ్చేందుకు యూనివర్సిటీలు ముగ్గురు సభ్యులతో తనిఖీ బృందాలను పంపించాలి. కానీ, ఒకరిద్దరు సభ్యులతో, వారిలోనూ అనర్హులతో తనిఖీలు చేయిస్తున్నాయి. ఆంధ్రకేసరి వర్సిటీలో ఇద్దరు సభ్యులతోనే తనిఖీలు చేయించగా, నాగార్జున వర్సిటీ పరిధిలో ఐదేళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులను ఈ బృందంలో నియమిస్తున్నారు. ఆదికవి నన్నయ్య, కృష్ణా వర్సిటీ పరిధిలోనూ ఇలాంటి లోపాలే లోపాలే కన్పిస్తున్నాయి.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.