• facebook
  • whatsapp
  • telegram

Courses: కోర్సులు.. విద్యాసంస్థల ఎంపికే కీలకం

‘ఈనాడు’-కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు        
విద్యార్థులకు వక్తల దిశా నిర్దేశం

విజయవాడ సిటీ, పటమట, న్యూస్‌టుడే: ఇంటర్‌ తరువాత తీసుకునే కోర్సులు, విద్యా సంస్థల ఎంపిక కీలకం అయినందున ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు, పలువురు విద్యావేత్తలు సూచించారు. డిసెంబ‌రు 14న‌ విజయవాడ ఆటోనగర్‌లోని ఏటీఏ హాలులో ఈనాడు-కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు ‘దశ.. దిశ’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్‌ వర్సిటీలోని వసతులు, ప్రాంగణ ఎంపికల గురించి నిపుణులు తెలియజేశారు. లక్కీడ్రాలో ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సదస్సు ప్రారంభంలో ‘ఈనాడు’ విజయవాడ యూనిట్‌ మేనేజర్‌ సీహెచ్‌ కె.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. పాఠకులకు కేవలం వార్తలే కాకుండా వారికి ప్రయోజనం చేకూరే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే విద్యా, ఉద్యోగపరమైన అవకాశాల గురించి సదస్సులు నిర్వహించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఇంజినీరింగ్‌ విద్య తరగతికే పరిమితం కాదు: డాక్టర్‌ జె.శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, కేఎల్‌ డీమ్డ్‌ వర్సిటీ
విద్యార్థులు చదువుతో పాటు అదనంగా మరిన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. అప్పుడే భవిష్యత్తుకు ప్రయోజనం ఉంటుంది. పరిశోధనల వైపు ప్రోత్సహించే విద్యా సంస్థలనే ఎంపిక చేసుకోవాలి. మా విశ్వవిద్యాలయంలో ఎంతో అనుభవం కలిగిన బోధనా సిబ్బంది ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు వంద శాతం ప్లేస్‌మెంట్‌తో బయటకు వెళ్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్య తరగతి గదులకే పరిమితం కాదు. నేర్చుకున్న సాంకేతిక అంశాలపై పరిశోధనలు చేయాలి. సమాజానికి ఉపయోపడేలా ఆవిష్కరణలుండాలి. కొందరు విద్యార్థులు తమ ప్రతిభతో కోర్సు పూర్తికాకముందే రూ.50 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో కొందరు నెలకు రూ.1.25 లక్షల ఉపకార వేతనం పొందుతున్నారు.  
పట్టుదల, లక్ష్య సాధన ముఖ్యం: బి.సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కేఎల్‌ డీమ్డ్‌  వర్సిటీ
పట్టుదల, లక్ష్య సాధన అనేది ప్రతి విద్యార్థికి అవసరం. వీటితో పాటు తమకు ఇష్టమైన కోర్సులను ఎక్కడ చదివితే బాగుంటుందనేది కూడా చూసుకుని ఉత్తమ విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి. విద్యా సంస్థలో సాధిస్తున్న ఫలితాలు, వస్తున్న కొలువులను పరిగణనలోకి తీసుకోవాలి. అలా ఎంపిక చేసుకుంటేనే భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వచ్చి కేఎల్‌లో ఏటా చేరుతుంటారు. వారి ఆకాంక్షకు అనుగుణంగా బోధన ఉండడంవల్ల అత్యుత్తమమైన మార్కులు సాధిస్తున్నారు.  అత్యధిక వేతనాలతో కొలువులు సాధించారు.   
మంచి వేతనంతో కొలువులు పట్టాలి: ఆచార్య షణ్ముఖ కుమార్‌, ·కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం
నాలుగేళ్లు మా విశ్వవిద్యాలయంలో అందించే చదువు 40 ఏళ్ల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇక్కడ పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏడాది తర్వాత విద్యార్థి ఆసక్తి మేరకు కోర్సులు మార్చుకొనే అవకాశం కల్పిస్తున్నాం.  దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రఖ్యాతిగాంచిన వర్సిటీలు చాలానే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధానమైన విద్యా సంస్థల్లో కేఎల్‌ విశ్వవిద్యాలయం ఒకటి. ఇక్కడ అనేక కోర్సులు, అపార అవకాశాలు  అందుబాటులో ఉన్నాయి. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తుండగా వారిలో 40 శాతం మందే ఉపాధిని సాధించగలుగుతున్నారు. మా విద్యా సంస్థలో చదువుతున్న వాళ్లంతా అత్యధిక వేతనాల్లో స్థిరపడుతున్నారు.
ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలు: వై.శారదాదేవి, శారదా విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌, విజయవాడ
దశ దిశ అనేది యువతకు అవసరం. ఇంజినీరింగ్‌ విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన చేసే విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలి. ఇష్టంతో చదివే విద్యార్థులకే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. పోటీతత్వానికి అనుగుణంగా ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
అభిరుచికి అనుగుణంగా..: జీవీ రావు, శారదా విద్యా సంస్థల జీఎం
విద్యార్థి అభిరుచికి అనుగుణంగా ఇష్టంతో చదవాలి. క్రీడలు, సాంస్కృతికం, సంగీతం వంటి వాటిపై కూడా ఆసక్తి చూపాలి. ఇంజినీరింగ్‌ చదివే సమయంలోనే ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా సిద్ధం కావాలి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.