• facebook
  • whatsapp
  • telegram

DIET Colleges: సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా రెండు డైట్‌ కళాశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి విడతలో రెండు ప్రభుత్వ డైట్‌ కళాశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. వాటిల్లో రెండేళ్ల డీఈడీ కోర్సును అందిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ, అన్ని రకాల సదుపాయాలను కల్పించే లక్ష్యంతో మహబూబ్‌నగర్‌, ఖమ్మం డైట్‌ కళాశాలలను ఎంపిక చేసింది. ఇందుకు ఒక్కో కళాశాలకు రూ.8 కోట్ల చొప్పున నిధులు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో పది ప్రభుత్వ డైట్‌ కళాశాలలు ఉండగా.. హైదరాబాద్‌లోని డైట్‌ స్థలాన్ని న్యాయస్థానం ఏర్పాటుకు కేటాయించడంతో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) ఈసారి అందులో ప్రవేశాలకు అనుమతివ్వలేదు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు

‣ సన్నద్ధతకు ముఖ్య సూచనలు!

‣ ఫ్యాషన్‌ కెరియర్‌లో ప్రవేశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.