• facebook
  • whatsapp
  • telegram

Versity VC's: ఇక వర్సిటీలకు పూర్తిస్థాయిలో వీసీలు

* గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వ నిర్ణయం



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఎక్కడా ఇన్‌ఛార్జులు ఉండొద్దని.. పూర్తిస్థాయిలో ఉప కులపతుల(వీసీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వవిద్యాలయాల పాలన, నిర్వహణ సజావుగా సాగేలా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం ముగియడానికి ముందే కొత్తవారి నియామకాలు జరపాలని భావిస్తోంది. ఈ మేరకు డిసెంబ‌రు 30న‌ జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీసీల నియామకాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వీసీల నియామకాల్లో జాప్యంతో ఐఏఎస్‌లను, ఇతర అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నారు. వారు పూర్తి సమయం కేటాయించకపోవడంతో ఆయా విశ్వవిద్యాలయాల పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కాగా వివిధ సమీకరణాల పేరిట ఉపకులపతుల నియామకాల్లో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం వచ్చే మే నెల వరకు ఉంది. ఈ లోపే  అన్ని విశ్వవిద్యాలయాలకు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటుచేసి.. వాటిద్వారా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని, అనంతరం కొత్తవారికి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.


అర్హులైన వారికే...

ఉపకులపతుల నియామకం ఆది నుంచీ వివాదాస్పదమవుతోంది. రాజకీయ జోక్యం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇక్కడ వీసీ, ఉన్నత విద్యాశాఖాధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అలానే పలువురు వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  సొంత నిర్ణయాలు తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, బదిలీలు చేపట్టడం, విశ్వవిద్యాలయాల ఆస్తులను పరిరక్షించకపోవడంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నివిధాలుగా అర్హులైన వారికే అవకాశాలు ఇవ్వాలని యోచిస్తోంది. ఖాళీగా ఉన్న తెలంగాణ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల ఎంపికపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

డీఎస్సీ తెలంగాణ


స్కూల్ అసిస్టెంట్


తెలుగు (కంటెంట్)

గణితం (కంటెంట్)

సోషల్ స్టడీస్ (కంటెంట్)



సెకండరీ గ్రేడ్ టీచర్స్

సైకాలజీ (కంటెంట్)

గణితం (కంటెంట్)

సైన్స్ (కంటెంట్)


తెలుగు పండిట్

కంటెంట్

మెథడాలజీ


బిట్ బ్యాంక్
 

ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)

బయాలజీ (కంటెంట్)

మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి


మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.