• facebook
  • whatsapp
  • telegram

 Education: ఏ వైద్య కళాశాలైనా ఫీజు ఎంతో ముందే చెప్పాలి 

* సొంతంగా చేర్చుకోవడం కుదరదు

* కౌన్సెలింగ్‌ మొత్తం ఆన్‌లైన్‌లోనే

* పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాలపై ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాలు
 

దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్లలోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌.. ఇటీవల వెలువరించిన ‘పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్య నియంత్రణలు-2023’’లో స్పష్టం చేసింది. ‘‘రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్‌ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు’’ అని ఎన్‌ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.