• facebook
  • whatsapp
  • telegram

Recruitment: స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య వ్యవస్థలలో ఖాళీగా ఉన్న 234 స్పెషలిస్టు వైద్యుల నియామకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌, డిస్ట్రిక్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌, తదితర ఆస్పత్రుల్లో పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఇతర మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్ర‌వ‌రి 7 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 19 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నామని,  9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావాలని ఆయన తెలిపారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.