• facebook
  • whatsapp
  • telegram

Jobs: ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌

* ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టీఎస్‌పీఎస్సీ

* ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే అమలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తోంది. గ్రూప్‌-1, 2, 3, 4లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. 

* నోటిఫికేషన్లు, పరీక్షలకు గడువు

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన తరువాత ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలకు స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా నియామకాలు పూర్తవుతాయి. ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్‌ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీతో పాటు పోలీసు, గురుకుల, వైద్యఆరోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయి.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.