• facebook
  • whatsapp
  • telegram

Medical colleges: కొత్త వైద్య కళాశాలలకు చకచకా ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న విద్యా సంవత్సరంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎనిమిది కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చేపట్టారు. గద్వాల, ములుగు, నారాయణపేట, నర్సంపేట, మెదక్‌, భువనగిరి, కుత్బుల్లాపూర్‌ (మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా), మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా)లో వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. వీటితో 400 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతి కోసం డీఎంఈ.. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే ఈ కళాశాలలకు ప్రిన్సిపాళ్లను నియమించారు. తాజాగా ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అనుబంధంగా ఆసుపత్రుల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.