• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 24-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి సైంజ్‌ సొంతం
ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సైంజ్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌ రేసులో సైంజ్‌ (25 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. లీక్లెర్క్‌ (ఫెరారీ, 19 పాయింట్లు), నోరిస్‌ (మెక్‌లారెన్, 15 పాయింట్లు), రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2. స్వీయ భౌతిక నిర్మాణంతో రంగుల హరివిల్లు! 
వర్ణకాల (పిగ్మెంట్‌లు) అవసరం లేకుండా, స్వీయ భౌతిక నిర్మాణంతోనే ప్రకాశవంతమైన రంగులను ప్రదర్శించగల మృదువైన పటలాలను (ఫిల్మ్స్‌) బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3. దక్షిణాదిలో రొమ్ము క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువ
భారత్‌లో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీల్లో రొమ్ము క్యాన్సర్‌ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. వచ్చే ఏడాది దేశంలో ఈ వ్యాధి మరింత పెరగొచ్చని కూడా పేర్కొంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4. మార్చి 24ను సంతాప దినంగా ప్రకటించిన పుతిన్‌
సంగీత కచేరీపై మాస్కో శివార్లలో విరుచుకుపడి 137 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5. కస్టడీ నుంచే కేజ్రీవాల్‌ పాలన
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.