• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 02-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  జమ్మూకశ్మీర్‌లో ఈఎల్‌ఎఫ్‌ సౌకర్యం!

జమ్మూకశ్మీర్‌లో అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం (ఈఎల్‌ఎఫ్‌) అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈఎల్‌ఎఫ్‌ అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ గుర్తింపు పొందింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.    అసోచామ్‌ అధ్యక్షుడిగా సంజయ్‌ నాయర్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202-25) అసోచామ్‌ అధ్యక్షుడిగా సంజయ్‌ నాయర్‌ బాధ్యతలు చేపట్టారు. సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు ఛైర్మన్‌ ఈయన. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్‌

ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్‌ సుమిన్వ నియమితులయ్యారు. గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4.  వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు

మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  హైదరాబాద్‌లో ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్‌ కమిటీ భేటీ

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేట్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) స్టాండింగ్‌ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


 

6.  టీ20 ప్రపంచకప్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌ 

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగేందుకు ఇది తాను చేస్తున్న త్యాగమని చెప్పాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

7.  టెలీ సేవల వినియోగంలో తెలంగాణది రెండో స్థానం

దేశంలో టెలికం సేవల వినియోగంలో 120 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. 108.19 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. టెలికం సేవలపై సచివాలయంలో నిర్వహించిన 6వ బ్రాడ్‌బ్యాండ్‌ కమిటీ సమీక్షలో ఆమె పాల్గొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.