• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 04-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

రష్యా వాంటెడ్‌ జాబితాలో జెలెన్‌స్కీ 
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేరును రష్యా తమ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

ఐఎస్‌ఎల్‌ ఛాంప్‌ ముంబయి 
ముంబయి సిటీ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో 3-1తో మోహన్‌ బగాన్‌పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్‌ కమింగ్స్‌ గోల్‌తో మొదట మోహన్‌ బగాన్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పకు అరుదైన గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) డైరెక్టర్‌ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. చారిత్రక రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ గ్లాస్గో(ఆర్‌సీపీఎస్‌జీ(యూకే)) ఆయనకు ఫెలోషిప్‌ ఆఫ్‌ ద రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ (ఎఫ్‌ఆర్‌సీఎస్‌) ప్రకటించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

సైబర్‌ దాడుల్లో భారత్‌ది మూడో స్థానం!
అమెరికా, బ్రిటన్‌ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్‌’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్‌ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

భాజపాలోకి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ 
దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్‌ సింగ్‌ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ సమక్షంలో ఆయన కాషాయ పార్టీ కండువా కప్పుకొన్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Updated Date : 05-05-2024 17:15:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం