• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group 1: జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష!

* 1 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

* అభ్యర్థులకు అందుబాటులో నమూనా ఓఎంఆర్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే.. ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. జూన్‌ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంట కోసారి బెల్‌మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్‌ను అడిగి సమయం తెలుసుకోవచ్చన్నారు. 

* అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్‌ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి.

* అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్‌ను కమిషన్‌ వెబ్‌సైట్లో ఇప్పటికే ఉంచారు. ఈ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేసుకోవాలి.

* అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి.

* హాల్‌టికెట్‌పై ముద్రించిన సూచనల కాపీని వెబ్‌సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి, వాటిని పరీక్ష సమయంలో పాటించాలి. అభ్యర్థులు చేసే పొరపాట్లకు, ఓఎంఆర్, హాల్‌టికెట్లలోని నిబంధనలు పాటించకుంటే కమిషన్‌ ఎలాంటి బాధ్యతా వహించదు.

* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి. బూట్లు ధరించకూడదు. 

* అభ్యర్థులకు బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. 

 

  TSPSC Group-1 Notification  


  TSPSC Group -1 Prelims Model papers  


  TSPSC Group-1 previous papers  


  TSPSC Group -1 prelims study material  


మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Published Date : 30-05-2024 12:07:04

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం