• facebook
  • whatsapp
  • telegram

Education: ఈసారి జోసాలో 121 విద్యా సంస్థలు  

* కొత్తగా ఒక ఎన్‌ఐటీ వస్తుందని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యా సంస్థలు ఈసారి మరో ఏడు పెరిగాయి. గత ఏడాది 114 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 121కి పెరిగింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే  26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించగా.. జూన్‌ 9న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాస్‌ జూన్‌ 3న జోసా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత సంవత్సరం 31 ఎన్‌ఐటీలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 32కు పెరుగుతుందని పేర్కొంది. దాని పేరు మాత్రం వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థలు 33 నుంచి 39కి పెరిగాయి. 23 ఐఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీల సంఖ్యలో మార్పు లేదు. వాటికి ఐఐఈఎస్‌టీ సిబ్‌పుర్‌(హౌరా వద్ద) అదనం. సీట్ల సంఖ్య, ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Published Date : 04-06-2024 11:26:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం