• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 16-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రి రిటైర్మెంట్‌!

భారత ఫుట్‌బాల్‌ మేటి, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. జూన్‌ 6న కువైట్‌తో జరిగే ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ అనంతరం రిటైర్‌కానున్నట్లు ప్రకటించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చైనా పర్యటన

రష్యాకు అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌ (71) తొలి విదేశీ పర్యటనకు చైనాను ఎంచుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా చేరుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్‌13బి’

సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  కేజ్రీవాల్‌కు ఎలాంటి మినహాయింపులివ్వలేదు: సుప్రీం కోర్టు

అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్‌ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  వినీత్‌ నయ్యర్‌ మరణం

టెక్‌ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్, మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన వినీత్‌ నయ్యర్‌ (85) దిల్లీలో మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.