• facebook
  • whatsapp
  • telegram

TSPSC Group 1 Prelims: జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్

* ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష

* అక్టోబర్ 21 నుంచి మెయిన్స్‌

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (Preliminary Test) నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) సమయాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన జరుగనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి ప్రధాన (Mains) పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నిషన్‌) పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌-1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు (Hall Tickets) పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అందుబాటులో రానున్నాయి. మెయిన్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు. 


 ♦ TSPSC Group-1 Study Material   


 ♦ Previous Papers   

   Model Papers   

 

Some more information 
  "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.