• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌పీసీఐఎల్‌లో అసిస్టెంట్‌ కొలువులు

డిగ్రీ అర్హతతో అవకాశం


ముంబయిలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 58 అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 (హెచ్‌ఆర్, ఎఫ్‌అండ్‌ఏ, సీ అండ్‌ ఎంఎం) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ, రెండో దశలో అడ్వాన్స్‌డ్, మూడో దశలో స్కిల్‌ టెస్ట్‌లు ఉంటాయి. 


అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 (హెచ్‌ఆర్‌) 29 పోస్టులు, ఏజీ-1 (ఎఫ్‌ అండ్‌ ఏ) 17, ఏఈ-1 (సీ అండ్‌ ఎంఎం) 12 ఉన్నాయి. ఈ మూడు పోస్టులకూ ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. 


దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్, ఎన్‌పీసీఐఎల్‌ ఉద్యోగులకు ఫీజు లేదు. వయసు 25.06.2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 


     ప్రిలిమినరీ టెస్ట్‌   

నాన్‌ టెక్నికల్‌ అభ్యర్థులందరికీ ఈ టెస్ట్‌ ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ - 25 ప్రశ్నలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ - 15 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ - 10 ప్రశ్నలు. వ్యవధి గంట. ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ ఒకమార్కు తగ్గిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌/ పీడబ్ల్యూబీడీ అబ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత సాధించినవారు స్టేజ్‌-2లోని అడ్వాన్స్‌ టెస్ట్‌కు ఎంపికవుతారు. 


     అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌   

50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 150 మార్కులు. వ్యవధి రెండు గంటలు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు - 25, క్రిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు - 25 ఇస్తారు. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ ఒకమార్కు తగ్గిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 30 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ ఈడబ్ల్యూఎస్‌/ పీడబ్ల్యూబీడీ 20 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. స్టేజ్‌-2లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. 

ప్రిలిమినరీ, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రెండింటినీ ఒకేరోజున నిర్వహిస్తారు. 

స్టేజ్‌-2లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. 


     స్టేజ్‌-3 (స్కిల్‌ టెస్ట్‌)  

దీంట్లో భాగంగా కంప్యూటర్‌ పైన 300 పదాల ఇంగ్లిష్‌ ప్రింటెడ్‌ ప్యాసేజ్‌ను లేదా 300 పదాల హిందీ ప్యాసేజ్‌ను టైప్‌ చేయాలి.

వ్యవధి పది నిమిషాలు. టైపింగ్‌ వేగం ఇంగ్లిష్, హిందీల్లో నిమిషానికి పది పదాలు ఉండాలి. 

ఇదే ప్యాసేజ్‌ను ఐదు నిమిషాల సమయంలో తమకు ఇచ్చిన ప్యాసేజ్‌లో ఉన్నట్టుగానే అమర్చి ప్రింట్‌ తీసుకోవాలి. 

పేరాగ్రాఫ్‌లను గుర్తించడం, బోల్డ్‌ చేయడం, వివిధ రకాల అక్షరాలూ, సైజులను వాడటం, ఇటాలిక్స్, అండర్‌లైన్‌ చేయడం, పేరాగ్రాఫ్స్‌ నంబర్లు వేయడం, సెంటర్‌ చేయడం, లెఫ్ట్, రైట్‌ అలైన్‌మెంట్, రెండు పక్కలా మార్జిన్, సింగిల్, డబుల్‌ లైన్‌ స్పేస్‌ ఇవ్వడం మొదలైన అంశాలను గమనిస్తారు. స్కిల్‌ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. 


     కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌   

అభ్యర్థి కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో నాలుగు ప్రశ్నలు, పేపర్‌-2లో రెండు ప్రశ్నలు ఇస్తారు. మొత్తం వంద మార్కులు. ఎంఎస్‌-వర్డ్, ఎక్సెల్, పవర్‌ పాయింట్, ఈమెయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నెట్‌ సర్ఫింగ్‌ అంశాలకు చెందిన ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో యాభై, ఆపై మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్కిల్‌ టెస్ట్‌ సమయంలో ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 

     సన్నద్ధత  

ప్రిలిమినరీ టెస్ట్‌కు సన్నద్ధం కావడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే పుస్తకాలు, వార్తాపత్రికలు చదవితే ఫలితం ఉంటుంది. 

అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌లోని అంశాలకు వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. 

స్కిల్‌ టెస్ట్‌ కోసం కంప్యూటర్‌పై పది నిమిషాల సమయం నిర్దేశించుకుని తప్పుల్లేకుండా, వేగంగా టైప్‌ చేయడానికి ప్రయత్నించాలి. 

టైప్‌ చేసిన మేటర్‌ను ఆకర్షణీయంగా రూపొందించడం నేర్చుకోవాలి. నిర్ణీత సమయంలోనే ఈ పని చేయగలగాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2024

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

Posted Date : 14-06-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం