• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ADCET: ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2024  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ)... వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సులను అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఏపీ ఉన్నత విద్యామండలి- ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2024 నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

ప్రవేశ పరీక్ష వివరాలు...

* ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2024

అందించే కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) ఇన్‌ పెయింటింగ్‌/ స్కల్ప్‌చర్‌/ యానిమేషన్‌/ అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ ఫొటోగ్రఫీ. 

అర్హతలు: ఇంటర్మీడియెట్‌ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీలకు రూ.750, ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

పరీక్ష విధానం: బీఎఫ్‌ఏ, బీడిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 120 నిమిషాలు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలు ఇస్తారు. 

పరీక్ష సిలబస్‌: జనరల్‌ నాలెడ్జ్, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌లో టెక్నికల్‌ డిటైల్స్, పెయిటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ, డిజైన్‌ స్కిల్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 23-04-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22-05-2024.

ఆలస్య రుసంతో దరఖాస్తులకు చివరి తేది: 31-05-2024.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడింగ్‌: 04-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 13-06-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :