• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIFT Admissions: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)… దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్ సెషన్ 2024-25కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్‌, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పుర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్.

కోర్సు వివరాలు:

1. బ్యాచిలర్ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి

* బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌): ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్.

* బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్

2. మాస్టర్స్ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి

* మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌)

* మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం)

* మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌)

3. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ)

అర్హతలు: యూజీ ప్రోగ్రామ్‌కు 10+ 2 పరీక్షలో ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్‌, బీఈ, బీటెక్‌; పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

యూజీ, పీజీ ప్రోగ్రామ్:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03-01-2024.

ఆలస్య రుసుము రూ.5000తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 04 నుంచి 08-01-2023 వరకు.

దరఖాస్తుల సవరణకు అవకాశం: 10 నుంచి 12-01-2023 వరకు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌: జనవరి మూడో వారం, 2024.

డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేదీ: 05-02-2024.

ఫలితాల వెల్లడి: మార్చి, 2024.

సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్, 2024.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభం: 15-01-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 29-02-2024.

దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ రెండో వారం, 2024.

అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్‌: ఏప్రిల్ చివరి వారం, 2024.

రాత పరీక్ష: మే మొదటి వారం, 2024.

రాత పరీక్ష ఫలితాల వెల్లడి: మే చివరి వారం, 2024.

రిసెర్చ్‌ ప్రపోజల్‌ ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ: జూన్ మూడో వారం, 2024.

ఫలితాల ప్రకటన: జులై రెండో వారం, 2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :