• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌- కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 

2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024’ నోటిఫికేషన్‌ను స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌(కటక్), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూదిల్లీ), సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ(గువాహటి)లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇన్‌స్టిట్యూట్‌ వివరాలు:

1. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్), కోల్‌కతా (ఎన్‌ఏఎల్‌డీ)

2. స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్

3. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై

4. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూదిల్లీ

5. కంపోజిట్‌ రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ (సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ), గువాహటి

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, కోర్సు వ్యవధి వివరాలు…

1. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్

2. బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్

3. బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్‌ ఆర్థోటిక్స్ (బీపీవో): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్

4. బ్యాచిలర్ ఇన్ అడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ): నాలుగేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో సహా)

మొత్తం సీట్ల సంఖ్య: 443.

అర్హత: కనీసం 50% మార్కులతో పన్నెండో తరగతి/ 10+2(సైన్స్‌ సబ్జెక్టులు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ మ్యాథమెటిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800. మిగతా కేటగిరీలకు రూ.1000.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌ తేదీ: 04.06.2024

ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024

ఫలితాల ప్రకటన: 05.07.2024




 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి


 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :