• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IGNOU Admission: ఇగ్నోలో యూజీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు 

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం-  ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).. జులై సెషన్‌ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో చేరేందుకు జూన్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ విధానంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. దీని ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్‌నెస్ డిగ్రీ ప్రోగామ్‌ సహా పలు కోర్సుల్లో చేరవచ్చు. 

కోర్సు వివరాలు:

1. యూజీ కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఎల్‌ఐఎస్‌ తదితరాలు.

2. పీజీ కోర్సులు: ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ తదితరాలు.

3. డిప్లొమా కోర్సులు: డీఈసీఈ, డీఎన్‌హెచ్‌ఈ, డీపీఎల్‌ఏడీ, డీఈవీఎంటీ, డీఏపీఎంఈటీ, డీఏపీఎంఈఆర్‌ఏ, డీటీఎస్‌, డీసీఈ, డీయూఎల్‌ తదితరాలు.

4. పీజీ డిప్లొమా కోర్సులు: పీజీడీఆర్‌డీ, పీజీడీసీఎఫ్‌టీ, పీజీడీటీ, పీజీడీఎస్‌హెచ్‌ఎస్‌టీ, పీజీడీఐబీఓ, పీజీడీఏఎస్‌టీ, పీజీడీఈఎస్‌డీ తదితరాలు.

5. పీజీ సర్టిఫికేట్ కోర్సులు: పీజీసీసీఎల్‌, పీజీసీపీపీ, పీజీసీసీసీ, పీజీసీజీఐ, పీజీసీఐఎన్‌డీఎస్‌, పీజీసీఏపీ, పీజీసీజీపీఎస్‌, పీసీసీబీహెచ్‌టీ తదితరాలు.

6. అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేట్ కోర్సులు: ఏసీఐఎస్‌ఈ, ఏసీపీడీఎం.

7. సర్టిఫికేట్ కోర్సులు: సీఎల్‌ఐఎస్‌, సీడీఎం, సీఈఎస్‌, సీఎల్‌టీఏ, సీపీఎస్‌సీఎం, సీఎఫ్‌ఎన్‌, సీఎన్‌సీసీ, సీఆర్‌డీ, సీఏపీఎంఈఆర్‌, సీఐజీ తదితరాలు.

8. అవేర్‌సెన్‌ అండ్‌ అప్రిసియేషన్‌ కోర్సులు: ఏపీడీఎఫ్‌, ఏసీఈ, ఏసీపీఎస్‌డీ.

ప్రోగ్రామ్‌ విధానం: ఓపెన్ అండ్‌ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (ఓడీఎల్‌), ఆన్‌లైన్ ప్రోగ్రామ్.

అర్హత: కోర్సును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, 10+2, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: యూజీ- మూడు లేదా నాలుగేళ్లు, పీజీ- రెండేళ్లు, పీజీ డిప్లొమా/ డిప్లొమా- ఏడది, పీజీ సర్టిఫికేట్/ సర్టిఫికేట్- 6 నెలలు, అవేర్‌సెన్‌- 2/ 3 నెలలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 17-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :