• facebook
  • twitter
  • whatsapp
  • telegram

FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు 

2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ సిద్దిపేట జిల్లా ములుగు (హైదరాబాద్‌)లోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 6 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ కళాశాల తెలిపింది. సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

వివరాలు:

* నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సు: 55 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్‌(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీజీ ఎంసెట్‌-2024 ర్యాంకు సాధించి ఉండాలి.

ప్రవేశ విధానం: టీజీ ఎంసెట్‌-2024 ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ అభ్యర్థులకు రూ.400).

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06-06-2024.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27-06-2024.

దరఖాస్తు సవరణ తేదీ: 30-06-2024.

మెరిట్ జాబితా వెల్లడి: 02-07-2024.

మొదటి దశ కౌన్సెలింగ్/ అడ్మిషన్: 08-07-2024.

జాబితా-1 సీట్ల కేటాయింపు: 09-07-2024.

ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్ చివరి తేదీ: 16-07-2024.

జాబితా-2 సీట్ల కేటాయింపు: 20-07-2024.

ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్ చివరి తేదీ: 26-07-2024.

జాబితా-3 సీట్ల కేటాయింపు: 29-07-2024.

ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్ చివరి తేదీ: 05-08-2024.

ఓరియంటేషన్‌, రిజిస్ట్రేషన్‌ తేదీ: 12-08-2024.
 

       మరింత సమాచారం...మీ కోసం!        
 

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

నలుగురితో కలిసిపోవాలంటే...


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :