• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GATB-BET2024: జీఏటీ-బీ, బీఈటీ 2024 

పోస్టు గ్రాడ్యుయేట్‌ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ(జీఏటీ-బీ) 2024, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) 2024 ప్రకటన వెలువడింది. జీఏటీ-బీ, బీఈటీ 2024ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

పరీక్ష వివరాలు...

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ(జీఏటీ-బీ) అండ్‌ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) 2024

* జీఏటీ-బీ కోర్సులు: ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంటెక్‌(బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ(యానిమల్‌ బయోటెక్నాలజీ).

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీపీటీ, బీటెక్‌, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఉత్తీర్ణులై ఉండాలి.

* బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేడెట్‌ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు.. దివ్యాంగులు, మహిళలు 31 ఏళ్లు మించకూడదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు.

దరఖాస్తు రుసుము:

జీఏటీ-బీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600)

బీఈటీ- రూ.1200(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600)

జీఏటీ-బీ, బీఈటీ(రెండూ)- రూ.2400 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1200)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 06-03-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 08-03-2024 నుంచి 09-03-2024 వరకు.

పరీక్ష తేదీ: 20-04-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :