తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2024 ఆగస్టులో జరగనుంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ నియామకాల అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఓయూ చూస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది. మే 14 నుంచి జులై 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటన వివరాలు:
* తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2024
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ)) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
పరీక్ష రుసుం: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్లకు రూ.1000.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, వైజాగ్, నల్గొండ.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-05-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-07-2024 (ఆలస్య రుసుం రూ.1500, రిజిస్ట్రేషన్ ఫీజుతో 08-07-2024; ఆలస్య రుసుం రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజుతో 16-07-2024; ఆలస్య రుసుం రూ.3000, రిజిస్ట్రేషన్ ఫీజుతో 26-07-2024).
దరఖాస్తులో మార్పులకు అవకాశం: 28, 29-07-2024.
హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: 20-08-2024.
పరీక్ష తేదీలు: 28, 29, 30, 31-08-2024.
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు