• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IBPS CRP RRB Recruitment: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)... రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,995 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ దశల్లో వడపోత అనంతరం దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో అభ్యర్థులు ఎంపికవుతారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

గ్రామీణ బ్యాంకులు: ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ తదితరాలు.

ఖాళీల వివరాలు:

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5,585 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-I: 3499 పోస్టులు

3. ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 70 పోస్టులు

4. ఆఫీసర్ స్కేల్-II (లా): 30 పోస్టులు

5. ఆఫీసర్ స్కేల్-II (సీఏ): 60 పోస్టులు

6. ఆఫీసర్ స్కేల్-II (ఐటీ): 94 పోస్టులు

7. ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 496 పోస్టులు

8. ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్): 11 పోస్టులు

9. ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్): 21 పోస్టులు

10. ఆఫీసర్ స్కేల్-III: 129 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 9,995.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (01-06-2024 నాటికి): ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21-32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21-40 ఏళ్లు; ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌/ మెయిన్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.

అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: జులై, 2024.

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: 22.07.2024 నుంచి 27.07.2024 వరకు.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు, 2024.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2024.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు/ సెప్టెంబర్, 2024.

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్, 2024.

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్‌ 2024.

మెయిన్స్‌/ సింగిల్‌ ఫలితాల వెల్లడి (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2024.

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2024.

ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): నవంబర్, 2024.

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): జనవరి, 2025.


 

       మరింత సమాచారం...మీ కోసం!        
 

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

నలుగురితో కలిసిపోవాలంటే...


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 07-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :