• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PNB SO Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోచ్చు. 

ప్రకటన వివరాలు...

1. ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు

2. మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు

3. మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

4. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,025.

విద్యార్హత: ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు; మేనేజర్‌ పోస్టులకు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఆఫీసర్‌కు రూ.36000-రూ.63840; మేనేజర్‌కు రూ.48170-రూ.69810; సీనియర్ మేనేజర్‌కు రూ.63840-రూ.78230.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: పార్ట్‌-1లో రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు- 50 మార్కులు); పార్ట్‌-2లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1180.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07.02.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.02.2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2024. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం! 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :