• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS DSC/ TRT 2024: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ 796 ఉన్నాయి. మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించింది. ఇతర కేటగిరీల పోస్టులకు విడిగా దరఖాస్తు చేస్తే వాటికి రూ.వేయి చొప్పున రుసుము చెల్లించాలి. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. గత డీఎస్సీలోని పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసినందున పాత అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

* 11 చోట్ల పరీక్ష కేంద్రాలు

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో జరిగే పరీక్షలను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. జిల్లాలను ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొనాలని, వాటి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేంద్రాలను కేటాయిస్తారు. 

* వేర్వేరు తేదీల్లో పరీక్ష

మొత్తం 10 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

* హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 డీఎస్సీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ముఖ్యాంశాలు...

* అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతులను పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.

* గత ఏడాది డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదు.

* సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ పూర్తి చేసిన వారే అర్హులు. బీఎడ్‌ వారు పోటీపడే అవకాశంలేదు.

* స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు సంబంధిత విధానంలో బీఎడ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. నాలుగేళ్ల బీఎడ్‌ పూర్తి చేసిన వారూ పోటీపడొచ్చు.

* ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

* బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. వారికి డీఎస్సీ వెరిఫికేషన్‌ నాటికి ధ్రువీకరణపత్రాలు ఉండాలి.

* అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్‌ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 5, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.

* తెలంగాణ, ఏపీ టెట్‌, లేదా సెంట్రల్‌టెట్‌(సీ టెట్‌)లో క్వాలిఫై అయి ఉండాలి.

* గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.

* ఎస్టీ రిజర్వేషన్‌ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.

* ఇంటర్‌లో మార్కుల శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతానికి సడలింపు

* గతంలో లోకల్‌, ఓపెన్‌కోటా రిజర్వేషన్‌ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలు చేస్తారు.

* జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒకటి మహిళతో భర్తీ చేస్తారు.

దరఖాస్తు తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4.3.2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-06-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2024.

ఆన్‌లైన్ పరీక్షల తేదీలు: 17-07-2024 నుంచి 31-07-2024 వరకు.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలు 


మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :