• facebook
  • whatsapp
  • telegram

PS Jobs: పట్టుదలతో శ్రమించారు.. కొలువులు సాధించారు

 

మూడో ప్రయత్నంలో.. షేక్‌ జానీ పాషా, పెంచికల్‌దిన్న, నేరేడుచర్ల: మా నాన్న వహీద్‌ లారీ డ్రైవర్‌గా, అమ్మ వజీద కూలి పని చేసి నన్ను చదివించారు. డిగ్రీ చదివా. మూడో ప్రయత్నంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించా. రెండవ సారి అర మార్కు తేడాతో ఉద్యోగం చేజారింది. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నించి విజయం సాధించా. రాత పరీక్ష కోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. గ్రంథాలయంలోని పుస్తకాలు తీసుకుని చదివా. 

గ్రూప్‌ వన్‌ లక్ష్యంగా.. సోమగాని శ్వేతగౌడ్‌
పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సోమగాని కృష్ణమూర్తి గౌడ్, లక్ష్మీ దంపతుల కుమార్తె సోమగాని శ్వేతగౌడ్‌ తెలంగాణ పోలీస్‌ నియామకాల బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. తల్లిదండ్రులు వ్యవసాయ చేసుకుంటు స్థానిక ప్రియదర్శి కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివించారు. గ్రూప్‌ వన్‌ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా చదువుతున్నాను.

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: పట్టుదలతో శ్రమించి పోలీసు కొలువుల సాధనలో ఆ గ్రామాల యువతీ, యువకులు ముందు వరుసలో నిలిచారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి కష్టపడి చదివి పోలీసు కొలువులు సాధించారు. ఎప్పుడు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినా దిర్శించర్ల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు ఎంపికవుతుంటారు. ఈ సారీ పోలీసు కానిస్టేబుళ్లుగా ఆ గ్రామస్థులు ఎంపికయ్యారు. పెంచికల్‌దిన్న గ్రామ యువతీ, యువకులు సైతం పోలీసు కొలువులు సాధిస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు.

అమ్మ అన్నీ తానై చదివించింది: చింతలచెర్వు వినోద్‌కుమార్, దిర్శించర్ల, నేరేడుచర్ల 
మానాన్న ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయాడు. అమ్మ లక్ష్మి హోటల్‌లో పని చేసి అన్నీ తానై చదివించింది. మేనమామ ప్రోత్సహించాడు. ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ ఖమ్మం క్రిష్టియన్‌ ట్రస్టు కళాశాలలో, పీజీ (సోషల్‌వర్కు) ఉస్మానియాలో చదివా. పేద కుటుంబం కావడంతో కొంత కాలం మందుల కంపెనీలో పని చేశా. టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. ఎస్సై కావాలన్న కోరిక ఉంది. 

ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా: బొమ్మనబోయిన మధు, దిర్శించర్ల, నేరేడుచర్ల 
ప్రస్తుతం నల్గొండ 12వ బెటాలియన్‌లో టీఎస్‌ఎస్‌ఎపీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నా. నాలుగు నెలలు సెలవు పెట్టి ఏఆర్‌ కానిస్టేబుల్‌ కోసం చదివి విజయం సాధించా. అయిదే క్రితం మానాన్న నాగయ్య గుండెపోటుతో చనిపోయారు. డిగ్రీ మిర్యాలగూడ వాసవీ కళాశాలలో చదివా. గ్రామంలో వ్యవసాయం చేసేవాడిని.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని