• facebook
  • whatsapp
  • telegram

Police Job: పోలీసు ఉద్యోగం.. కేరాఫ్‌ మల్లవరం  


తల్లాడ, న్యూస్‌టుడే: ఆ ఊరి యువతకు పోలీసు కొలువులంటే ఎంతో మక్కువ. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రుల కష్టాల్లో పాలుపంచుకుంటూనే ఉద్యోగాలకు సాధన చేస్తుంటారు. శ్రమించేతత్వం, శారీరక దారుఢ్యం, సీనియర్ల ప్రోత్సాహం, కఠోర సాధనతో కొలువులను సొంతం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కానిస్టేబుల్‌ నియామక తుది ఫలితాల్లో గ్రామం నుంచి 13 మంది ఎంపికై ఊరి ఆనవాయితీని కొనసాగించారు. ఇదీ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామ యువత ఘనత. రెండు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన దాసరి వీరభద్రరావు యూత్‌క్లబ్, ఖమ్మం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్రదాన కార్యక్రమంలో స్థానిక యువత చురుగ్గా పాల్గొంటారు. ఈ క్రమంలో అప్పటి అదనపు ఎస్పీ జి.సుధీర్‌బాబుకు గ్రామంతో సాన్నిహిత్యం ఏర్పడింది. యువత పోలీసు ఉద్యోగాలు సాధించే దిశగా ఆయన ప్రోత్సహించారు. ఫలితంగా 2003లో ఒకేసారి నలుగురు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.  గ్రామం నుంచి 2003లో నలుగురు, 2012లో నలుగురు, 2018లో 17 మంది, 2020లో 17 మంది, ప్రస్తుతం 13 మంది పోలీసు కొలువులకు ఎంపికయ్యారు.
 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని