• facebook
  • whatsapp
  • telegram

Success: విజయం అతడి పాదాక్రాంతం

కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత

మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత

 

లాతూర్‌: చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు. పట్టుదలతో అవరోధాలన్నింటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేశాడు. అదీ సహాయకుడు(స్క్రైబ్‌) లేకుండా పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించాడు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 17 ఏళ్ల గౌస్‌ షేక్‌కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. స్థానిక తండాలో ఆయన తండ్రి అంజాద్‌ ప్యూన్‌గా పనిచేస్తున్న రేణుకాదేవి హయ్యర్‌ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో హైస్కూల్‌ విద్య పూర్తి చేశారు. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను కాలి వేళ్లతో రాసిన గౌస్‌ తాజాగా విడుదలైన ఫలితాల్లో 78 శాతం మార్కులు సాధించి ఔరా! అనిపించాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే గౌస్‌ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటాడని, ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలో ఇక్కడి ఉపాధ్యాయులు గౌస్‌కు కాలి వేళ్లతో రాసేలా శిక్షణ ఇచ్చారని అంజాద్‌ తెలిపారు. ఐఏఎస్‌ కావడం తన లక్ష్యమని ఈ సందర్భంగా గౌస్‌ తెలిపాడు.

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

Posted Date: 25-05-2024


 

అకడమిక్ పరీక్షలు