• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి జోరు

ద్రవ్యోల్బణ నియత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ గత నెలలో వెల్లడించారు. కానీ, ధరల పెరుగుదల మాత్రం అదుపులోకి రావడంలేదు. కొవిడ్‌ ఉద్ధృతి, ఉక్రెయిన్‌ యుద్ధం వంటివి నిరుడు ద్రవ్యోల్బణం కట్టుతప్పడానికి దారితీశాయి. వాతావరణ మార్పుల కారణంగా ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గడంతో ధరలు మళ్ళీ ఎగబాకుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తేగాని దేశం వృద్ధి పథంలో పరుగులు తీయలేదు.

ద్రవ్యోల్బణ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దేశంలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం జనవరిలోనే 6.5శాతాన్ని తాకింది. మూడు నెలల గరిష్ఠమది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 2-6శాతం మధ్యలోనే పట్టినిలపాలని 2016లో నిర్ణయించారు. కానీ, 2022లో పది నెలలపాటు ఇది పరిమితికి మించే కొనసాగింది. చివరి రెండు నెలల్లో మాత్రమే దిగివచ్చింది. కొవిడ్‌ వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నం కావడం, ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం వల్ల నిరుడు భారత్‌లో ద్రవ్యోల్బణం హెచ్చింది. 2023లో అది మళ్ళీ పెరగడానికి వేరే కారణాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడంతో వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చింది. 2021-22లో భారత్‌లో గోధుమ ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంకన్నా 2.5శాతం తగ్గింది. మరోవైపు ప్రభుత్వం కనీస స్థాయికన్నా కాస్త ఎక్కువగా మాత్రమే ధాన్యాన్ని సేకరించింది. దాంతో ధరలు పెరిగినప్పుడు ఎక్కువ నిల్వలను మార్కెట్‌లోకి విడుదలచేసే వెసులుబాటు లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా ఎల్‌నినో వల్ల పంటలు దెబ్బతినవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వలు తగ్గి మార్కెట్‌లో ధరలు మరింతగా పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధిలో దేశం జోరందుకోవాలంటే- ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయాల్సిందే!

గ్రామీణార్థికం కీలకం

ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే పొదుపు మొత్తాలు హరించుకుపోతాయి. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పెట్టుబడులు విదేశాలకు తరలిపోతాయి. ఫలితంగా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విపరిణామాలు సంభవిస్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ఏం జరుగుతోందో విధానకర్తలు గమనించాలి. కొవిడ్‌ వల్ల కుదేలైన గ్రామీణార్థికం ఇటీవల మళ్ళీ పుంజుకొంటోంది. పల్లెల్లో వాస్తవ ఆదాయాలు ఇప్పుడు కొవిడ్‌ ముందునాళ్ల కన్నా పెరిగాయని హాంకాంగ్‌-షాంఘై బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎస్‌బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గ్రామాలతో మమేకమైన అసంఘటిత రంగమూ వృద్ధిబాట పడుతోంది. ఇది శుభవార్తే. కానీ దీని పర్యవసానాలనూ పరిశీలించాలి. గ్రామాల్లో ఆదాయాలు పెరిగినప్పుడు ఆహార ధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. వినియోగ వస్తువుల ధరలన్నీ పైచూపు చూస్తాయి. నిరుడు ఆహారోత్పత్తి తగ్గినా, శీతాకాల పంట ఈ మార్చి-ఏప్రిల్‌లో చేతికి వచ్చి పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదీ వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు విఫలమైతే ఆర్థిక స్థితిగతులు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. గ్రామాల్లో పెరుగుతున్న గిరాకీని, పంట దిగుబడులు తగ్గే ముప్పును పరిగణనలోకి తీసుకుని ద్రవ్యోల్బణ కట్టడికి విధానకర్తలు పట్టుబిగించాలి.

ప్రభుత్వం మొదట ఆహార ధరల పెరుగుదలను నియంత్రించడంపై దృష్టి సారించాలి. ఆహార దిగుమతులను పెంచేలా విధాన నిర్ణయం తీసుకోవాలి. ఎల్‌నినో వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చనే అంచనాల మధ్య దిగుమతుల ద్వారా ఆహార నిల్వలను పెంచాలి. ఫలితంగా మార్కెట్‌పై ఒత్తిడి తగ్గి ద్రవ్యోల్బణ నిరోధానికి వ్యవధి లభిస్తుంది. శీఘ్రంగా ఆహార దిగుమతులు చేసుకోకపోతే సమీప భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. పప్పుగింజల దిగుమతిపై సుంకాన్ని తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే. దాంతోపాటు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ ధర ఇవ్వజూపి ఆహార ధాన్యాల నిల్వలను పెంచుకోవాలి. అక్రమ నిల్వదారుల ఆటకట్టించాలి. మార్కెట్‌కు తగు పరిమాణంలో నిరంతరం ఆహార ధాన్యాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటూనే ధరల గుర్రాలకు కళ్లెం బిగించాలి. వర్తకులు ధరలను కృత్రిమంగా పెంచకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే- వినియోగ ధరల పెరుగుదలా అదుపులోనే ఉంటుంది. ఇవన్నీ స్వల్పకాలిక చర్యలే. కేంద్రం ద్రవ్యోల్బణ నిరోధానికి దీర్ఘకాలిక చర్యలపైనా దృష్టి కేంద్రీకరించాలి.

వ్యవసాయమే ప్రధానం

దక్షిణ అమెరికా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు నిర్దిష్ట పరిమితికి మించితే కేంద్ర బ్యాంకులు నిరోధక చర్యలను చేపడతాయి. వడ్డీరేట్లను పెంచడం వంటి చర్యలతో ద్రవ్యోల్బణాన్ని నిర్దిష్ట వ్యవధిలో నిర్దేశిత పరిమితిలోకి తీసుకొస్తాయి. 2016 నుంచి భారతీయ రిజర్వు బ్యాంకూ ఇదే విధానాన్ని అనుసరించినా నిరుడు ద్రవ్యోల్బణాన్ని సరిగ్గా కట్టడి చేయలేకపోయింది. వ్యవసాయం, ఇతర రంగాల నుంచి డేటాను సేకరించి, విశ్లేషించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేయవచ్చు. తద్వారా శీఘ్రంగా తగు విధానాలను రూపొందించుకోవచ్చు. ద్రవ్య లభ్యత, వడ్డీరేట్లకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ద్రవ్య విధానంలో అంతర్భాగాలు. ఏతావతా ద్రవ్యోల్బణమనేది కేవలం సరకుల సరఫరా, గిరాకీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ద్రవ్య విధానం, విత్త విధానం, ఫైనాన్స్‌ రంగాలు కలిసికట్టుగా పరిష్కరించాల్సిన వ్యవహారం. సంపన్న దేశాలు ప్రధానంగా ద్రవ్య విధానంతోనే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అక్కడ ఫైనాన్స్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. వర్ధమాన దేశాల్లో వ్యవసాయమే ప్రధానం కాబట్టి ద్రవ్యోల్బణానికి మూలం, పరిష్కారం ఆ రంగంలోనే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన విధానాలను రూపొందించి అమలు చేయాలి.

ద్రవ్య లభ్యతను తగ్గించడం సరికాదు...

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా వడ్డీరేట్లను పెంచి ద్రవ్య లభ్యతను తగ్గించే విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించలేం.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో భారత ఆర్థికానికీ బ్రేకులు పడకమానవు. రిజర్వు బ్యాంకు మళ్ళీ వడ్డీరేట్లు పెంచితే బ్రేకులు పడటం ఖాయం. అధిక వడ్డీరేట్లు రుణ లభ్యతను, తద్వారా పెట్టుబడులను అడ్డుకొంటాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలు మందగించి ఎదుగూబొదుగూ లేక ఆర్థిక స్తబ్ధత నెలకొంటుంది. కాబట్టి ఒక్క రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానంతోనే ద్రవ్యోల్బణ కట్టడి సాధ్యపడదు. ఇందుకు విధానపరంగానూ పలు చర్యలు తీసుకోవాలి.
 
********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సముద్ర సహకారంలో చెట్టపట్టాల్‌!

‣ భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

Posted Date: 18-03-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక రంగం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం