• facebook
  • whatsapp
  • telegram

American universities: ఇక నుంచి టోఫెల్‌ స్కోర్లను అమెరికా వర్సిటీలు ధ్రువీకరించుకోవచ్చు

దిల్లీ: అమెరికన్‌ యూనివర్సిటీలు ఇక నుంచి విద్యార్థుల టోఫెల్‌ స్కోర్లను ధ్రువీకరించుకునే అవకాశముందని టోఫెల్‌, జీఆర్‌ఈలను నిర్వహించే ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. దీనికోసం- దక్షిణాసియా నుంచి అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపించే కెరీర్‌ మొజాయిక్‌ సంస్థతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల విశ్వవిద్యాలయాలకు అందే విద్యార్థుల బయోడేటాపై మరింత విశ్వసనీయత పెరుగుతుందని.. వాటి ఆధారంగా మెరుగైన ఎంపిక చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. టోఫెల్‌ను ఎక్కువగా రాసే భారతీయ విద్యార్థులకు, అమెరికా వర్సిటీలకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని కెరీర్‌ మొజాయిక్‌ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీషా జవేరీ పేర్కొన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.