• facebook
  • whatsapp
  • telegram

AP Group-1: ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులు

* తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళ‌న‌ 

ఈనాడు,అమరావతి: ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. మార్చి 17న జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. చరిత్ర విభాగం (బి సిరీస్‌) 22వ ప్రశ్నలో ఆంగ్లం నుంచి తెలుగులోనికి ‘అతివాద దశ’ అని పేర్కొనడానికి బదులు తీవ్రవాద దశగా అనువాదం చేశారు. పేపరు-2లో సైన్స్‌ అండ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (సి సిరీస్‌) 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి ‘కొత్త’ (నావెల్‌) పరికరం ద్వారా నిర్ధారణ పరీక్షలు అన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు. దీని వల్ల అర్థం పూర్తిగా మారిపోయింది. 109వ ప్రశ్నలో కోస్ట్‌గార్డ్‌ సైనిక విన్యాసాలు అని కాకుండా కోస్ట్‌గార్డ్‌ వ్యాయామమని ముద్రించారు. 89వ ప్రశ్నలో జీవవిచ్ఛిన్నం అనే పదాన్ని స్మార్ట్‌ బయోడిగ్రేడబుల్‌ అని ఆంగ్లంలోనే యథావిధిగా ఇచ్చారు. అలాగే 90వ ప్రశ్నలో గుండ్రటి రూపం అనడానికి బదులు ఆంగ్లంలోని రింగ్‌ అనే పదాన్ని తెలుగులోనూ అదే విధంగా ఇచ్చారు. అలాగే మరో ప్రశ్నలో తెలుగులో భ్రూణం అని ముద్రించాల్సి ఉండగా పిండం అని ముద్రించారు. ఇలా మరికొన్ని ప్రశ్నలు తెలుగులో అర్థరహితంగా ఉన్నాయి. ప్రశ్న పత్రంలో ముద్రణా పరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి. జైన మతరచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాన్ని, జైనులు అనే పదానికి ‘ప్రాజైనులు’ అని ముద్రణ అయింది. మరోప్రశ్నలో పార్లమెంటరీ విశేషాధికారాలు అని కాకుండా పార్లమెంటరీ అధికారాలు అని అనువదించారు. ఇదే ప్రశ్నలో వైడర్‌ ఇంప్లికేషన్స్‌ అనే పదాన్ని విస్తృత పరిణామాలు అని అనువదించడానికి బదులు ‘విస్తృతమైన చిక్కులు’గా ముద్రించారు.

తెలుగు అభ్యర్థుల తికమక...

తెలుగు అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సార్లు అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు.  కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడుతున్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.