ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-1 స్ర్కీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను ఈ నెల 10 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో శుక్రవారం (మార్చి8న) తెలియజేశారు. గతంలో నిర్ణయించిన విధంగానే మార్చి 17న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని, అందులోని గైడ్ లైన్స్ ను చదువుకోవాలన్నారు. కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని సూచించారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.