• facebook
  • whatsapp
  • telegram

Forest Department: అటవీ శాఖలో ఖాళీగా 30% పోస్టులు

* 6,860 మందికి.. ఉన్నది 4,752 మందే

* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీలు భారీగా ఉన్నాయి. ఆక్రమణలు, కలప స్మగ్లింగ్‌, అగ్నిప్రమాదాల నివారణ, పచ్చదనం పెంపు, పెద్దపులులు సహా వన్యప్రాణుల సంరక్షణ.. ఇలా కీలకమైన బాధ్యతలు, సవాళ్లున్న ఈ శాఖలో పెద్దసంఖ్యలో ఉన్న ఖాళీలు ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నా.. మరోవైపు ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశాలన్నింటినీ.. ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు.

* విభాగాల వారీగా ఖాళీలు ఇలా..

అటవీశాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 37 మంజూరు కాగా 36 ఖాళీగా ఉన్నాయి. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 3,652కు గాను 1419, నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 843కు 414 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పోస్టులు 61కి 15, ఐఎఫ్‌ఎస్‌ పోస్టులు 81కి 26, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 734కి 64, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు 274కి 21, అటవీ కళాశాలలో 66కు 52, ఇతర పోస్టులు 1112కి 61 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నారని, 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు నివేదించారు.

డిప్యుటేషన్ల వివరాలు కోరిన సీఎం

ఈ క్రమంలో అటవీశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 26 ఐఎఫ్‌ఎస్‌ పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. మిగిలిన విభాగాల్లో ఖాళీల భర్తీకి తాజా ప్రతిపాదనలు పంపించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.



మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.