• facebook
  • whatsapp
  • telegram

Group: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు రెండు రోజుల పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి జారీచేసిన ఉద్యోగ ప్రకటన (నం.02/2024) దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగించింది. మార్చి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమిచ్చింది. తొలుత ఇచ్చిన గడువు గురువారం (మార్చి 14)తో ముగిసింది. చివరిరోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించారు. మరో రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కమిషన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్‌-1 ప్రకటనకు.. మార్చి 23 నుంచి కమిషన్‌ ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాలని, కొత్తగా విద్యార్హతలు పొందిన ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.