• facebook
  • whatsapp
  • telegram

Jobs: యూనికార్న్‌లతో 5 కోట్ల ఉద్యోగాలు

* ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జతచేరతాయ్‌

* 2030కి సీఐఐ అంచనాలు

దిల్లీ: 2030 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు యూనికార్న్‌లు 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల)ను జత చేయగలవని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తన నివేదికలో పేర్కొంది. ఫలితంగా 5 కోట్ల కొత్త ఉద్యోగాలను ఇవి సృష్టించగలవని అంచనా వేసింది. 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8300 కోట్లు), అంత కంటే అధిక విలువ ఉన్న అంకురాలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. మెకిన్సే అండ్‌ కంపెనీతో కలిసి ‘యూనికార్న్‌ 2.0: యాడింగ్‌ ద నెక్ట్స్‌ ట్రిలియన్‌’ పేరిట సీఐఐ విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు..

* 2029-30 కల్లా భారత్‌ 7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.581 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అప్పటికి యూనికార్న్‌లు 1 లక్ష కోట్ల డాలర్లను సమకూరుస్తాయి.

ఇ-కామర్స్‌, తదుపరి తరం ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌(ఎస్‌ఏఏఎస్‌), డిజిటల్‌ రంగాలు రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధికి ఉపకరిస్తాయి.

* 2011లో దేశంలో తొలి యూనికార్న్‌ ఆవిర్భవించింది. తదుపరి దశాబ్ద కాలంలోనే 100 యూనికార్న్‌లకు పైగా అవతరించాయి. 2024 జనవరి నాటికి దేశంలోని 113 యూనికార్న్‌ల మొత్తం విలువ  350 బి. డాలర్లు (సుమారు రూ.29.05 లక్షల కోట్లు)గా నిలిచింది.

* 100 యూనికార్న్‌లు పైగా ఏర్పడడం ఒక మైలురాయిలాంటిది. మొబైల్‌ ఇంటర్నెట్‌ విస్తరించడం, మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరగడం, నియంత్రణపరమైన మద్దతు, డిజిటల్‌కు అలవాటు పడ్డ యువ జనాభా అధికంగా ఉండడం.. ఇలా పలు అంశాలు ఈ మైలురాయికి దోహదపడ్డాయి.

* 100కు పైగా యూనికార్న్‌లు, లక్ష వరకు అంకురాలు కలిసి 2016-2023 మధ్య జీడీపీ వృద్ధికి 10-15%  వాటాను అందించాయి.

* పట్టణాల్లోనే కాకుండా.. గ్రామాల్లోనూ వేగంగా డిజిటలీకరణ జరగడంతో మొత్తం కొత్త ఉద్యోగావకాశాల్లో 20-25 శాతాన్ని అంకురాలే అందిస్తాయి.

* 2015తో పోలిస్తే అంకురాల సంఖ్య 4,000 నుంచి లక్షకు చేరాయి. 2022-23లో అంకురాలు 140  బి.డాలర్ల (సుమారు రూ.11.62 లక్షల కోట్ల)ను ఆర్థిక వ్యవస్థకు అందించగలిగాయి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.