• facebook
  • whatsapp
  • telegram

Latest News:20-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC: ఏపీపీఎస్సీ అప్పీల్‌పై మార్చి 20న విచారణ

2018 నాటి గ్రూప్‌ 1 ప్రధాన పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ వేసిన అప్పీల్‌పై జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణ జరపనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. H1B visa: హెచ్‌ 1బీ వీసా దరఖాస్తుకు 22 వరకూ గడువు

 విదేశీ వృత్తి నిపుణులు 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌ 1బీ వీసా దరఖాస్తు పెట్టుకోవడానికి మార్చి 22తో గడువు ముగుస్తుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. DSC:డీఎస్సీని వాయిదా వేయండి

 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకి తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మార్చి 19న  లేఖ రాశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. D.ED Exams: ఏప్రిల్‌ 22 నుంచి డీఎడ్‌ పరీక్షలు

అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌) ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఏప్రిల్‌లో రెండు పూటలా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Admissions: ‘గీతం’ దూర విద్యా కోర్సుల్లో ప్రవేశాలు

ఇంటి వద్దే ఉంటూ ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ చదువు కొనసాగించాలనుకునేవారికి నామమాత్రపు రుసుంతో గీతం డీమ్డ్‌ వర్సిటీ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌(సీడీఎల్‌) ద్వారా వివిధ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు సీడీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.