• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ అప్పీల్‌పై మార్చి 20న విచారణ

ఈనాడు, అమరావతి: 2018 నాటి గ్రూప్‌ 1 ప్రధాన పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ వేసిన అప్పీల్‌పై జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణ జరపనుంది. ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో తమ అప్పీలుపై అత్యవసర విచారణ జరపాలని వేరే బెంచ్‌ ముందు ఏపీపీఎస్సీ తరఫు సీనియర్‌ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్‌ బెంచ్‌ ముందే తేల్చుకోవాలని జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి నేతృత్వంలోని ధర్మాసనం సూచించడంతో ఈ అప్పీల్‌పై రెగ్యులర్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరపనుంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.