• facebook
  • whatsapp
  • telegram

Posts: ‘గాంధీ’లో 121 పోస్టుల భర్తీ

* ఒప్పంద విధానంలో నియామకానికి ఏర్పాట్లు

గాంధీ ఆసుపత్రి: గాంధీ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రుల్లో 121 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో.. కళాశాల యాజమాన్యం ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఎంసీహెచ్‌ ప్రత్యేక ఆసుపత్రి రావడం అందులో గైనకాలజీ, పీడియాట్రిక్‌ సహా వాటికి సంబంధించిన విభాగాలు ఏర్పడిన నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరమైంది. మొత్తం 22 విభాగాలకు గాను మూడు విభాగాలకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 73, ట్యూటర్లు 8, సీనియర్‌ రెసిడెంట్లు 37 మందిని కాంట్రాక్టు, గౌరవవేతనం చెల్లించే పద్ధతిలో నియమించనున్నారు. వచ్చే ఏడాది మార్చి31 వరకు ఏడాదిపాటు విధులు నిర్వహించేలా అర్హులైన వారిని మార్చి 16న ఇంటర్వ్యూల ద్వారా నియమించాలని యంత్రాంగం నిర్ణయించింది. అర్హులు గాంధీ మెడికల్‌ కాలేజీలోని ప్రిన్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.