• facebook
  • whatsapp
  • telegram

SEBI: సెబీలో 97 ఆఫీసర్ల పోస్టులు

* దరఖాస్తుల ఆహ్వానం

దిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) ఈ ఏడాది వివిధ విభాగాల్లో 97 మంది ఆఫీసర్లను నియమించుకోవాలని భావిస్తోంది. తన నియంత్రణ బాధ్యతలను వేగంగా, మరింత ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు ఈ పోస్టులు అవసరమని తెలిపింది. సాధారణ, న్యాయ, సమాచార సాంకేతిక, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, పరిశోధన-అధికార భాష విభాగాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు అర్హులైన భారతీయులే దరఖాస్తు చేసుకోవాలని  తెలిపింది. ఇందులో సాధారణ విభాగంలోనే 62 మందిని నియమించుకోనుంది. 24 మందిని సమాచార సాంకేతిక విభాగంలో, అయిదుగురిని న్యాయ బృందంలో, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, పరిశోధన-అధికార భాష విభాగాల్లో చెరో ఇద్దరిని ఎంపిక చేయాలనుకుంటోంది. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉండనుంది. తొలి దశ ఆన్‌లైన్‌ పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఈ దశ పూర్తయితే రెండో దశలో మరో రెండు పేపర్లు ఆన్‌లైన్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఎంపికైన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించి తుది ఎంపిక చేస్తారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.