• facebook
  • whatsapp
  • telegram

TSPSC : అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దరఖాస్తుల స్వీకరణ ఎన్నడు?

* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులపై సందిగ్ధం


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసినా తదుపరి కార్యాచరణ మొదలుకాలేదు. 2022 డిసెంబరులో ప్రకటన వచ్చినా నేటికీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వలేదు. ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనలు అందించిన కళాశాల విద్యాశాఖ.. సబ్జెక్టుల వారీగా విద్యార్హతలు, ఇంటర్వ్యూ నిబంధనలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ పోస్టులకు ఇప్పటివరకు సమగ్ర ప్రకటన జారీ కాలేదు.


* రెండుసార్లు వాయిదా

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన (నం.33/2022) జారీ చేసింది. లెక్చరర్‌ పోస్టులు 491.., ఫిజికల్‌ డైరెక్టర్‌ 29.., లైబ్రేరియన్‌ 24 పోస్టులు ఉన్నాయి. వీటి సమగ్ర ప్రకటన జారీకి మరిన్ని వివరాలు కావాలని కమిషన్‌ కోరగా కళాశాల విద్యాశాఖ జాప్యం చేసింది. లెక్చరర్‌ పోస్టులకు మెథడాలజీ వివరాలివ్వలేదు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు (డెమో తరగతులు) నిర్వహించాలి. దీనిపైనా స్పష్టతలేదు. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. కళాశాల నుంచి వివరాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 9 వరకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ వివరాలు రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ పేర్కొంది. ప్రభుత్వ విభాగాల్లో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు (గ్రేడ్‌-2) పోస్టులకు 2022లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షకు దాదాపు 1.06 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2023 ఫిబ్రవరి 26న ఓఎంఆర్‌ పద్ధతిలో రాతపరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను కమిషన్‌ రద్దుచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు, చిన్నారుల వసతిగృహాల్లో సూపరింటెండెంట్‌ కేటగిరీల్లో 581 పోస్టులకు ఏడాది క్రితమే 1.45 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఏడాది గడుస్తున్నా ఈ పోస్టుల రాతపరీక్ష తేదీ వెల్లడించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.