• facebook
  • whatsapp
  • telegram

UGC: అంబుడ్స్‌మన్‌ లేని విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసిన యూజీసీ

దిల్లీ: దేశంలో అంబుడ్స్‌మన్‌లు లేని విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్చి 13 విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు నెల రోజుల్లోగా అంబుడ్స్‌మన్‌లను నియమించాలంటూ 2023 ఏప్రిల్‌లో యూజీసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు జారీచేసి దాదాపు ఏడాది కావస్తున్నా విశ్వవిద్యాలయాలు స్పందించకపోవడంతో తాజాగా 228 విశ్వవిద్యాలయాల పేర్లు ఉన్న జాబితాను యూజీసీ విడుదల చేసింది. వీటిలో 159 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 67 ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, 2 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.

జాబితాలో ఆరు తెలుగు విశ్వవిద్యాలయాలు..

తెలుగు రాష్ట్రాల నుంచి మూడేసి చొప్పున ఆరు విశ్వవిద్యాలయాల పేర్లను యూజీసీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌-వరంగల్‌, నిమ్స్‌ మెడికల్‌ కాలేజీ-హైదరాబాద్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ-బాసర. ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ- విజయవాడ, క్లస్టర్‌ యూనివర్సిటీ-కర్నూలు, శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ- తిరుపతిలు ఉన్నాయి.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.