• facebook
  • whatsapp
  • telegram

AP Tenth Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత

* మొదటి స్థానంలో పార్వతీపురం, చివర్లో కర్నూలు

విజయవాడ: ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద బాలికలు 89.19 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. బాలురు 84.32 శాతం పాసయ్యారు. 2,803  పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు పాస్ అయితే, 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.96.37 ఉత్తీర్ణత శాతంతో పార్వతీపురం  మన్యం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.  62.47 శాతంతో కర్నూలు చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్  వేల్ఫేర్‌ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38  శాతం,  ప్రైవేటు  ఎయిడెడ్‌ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు.


ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు

ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో పాసయ్యారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
 



 CLICK HERE FOR AP TENTH CLASS 2024 RESULTS    

♦ After Tenth Intermediate courses

♦ After Tenth Intermediate vocational courses

♦ After Tenth government Jobs

♦ After Tenth ITI

♦ After Tenth Polytechnic courses

♦ After Tenth Agriculture polytechnic courses

♦ After Tenth RJC CET

♦ After Tenth class other courses
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.